రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు..

58
- Advertisement -

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్ల 51వ సమావేశం.. రాష్ట్రపతి భవన్​లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా సహా పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరై.. రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్లకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.

- Advertisement -