తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

456
tamilisai
- Advertisement -

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారినికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.

అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. దర్శనం అనంతరం తమిళిసై మిడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి దర్శనం‌కు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు.

tamilisai

- Advertisement -