అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచిన మహోన్నత వ్యక్తి ఈశ్వరిబాయి అన్నారు గవర్నర్ తమిళి సై. రవీంద్ర భారతీ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దళిత సంక్షేమకర్త, అంబేద్కర్ వాదీ, సమాజ సేవకురాలు జెట్టి ఈశ్వరీ బాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ D. నాగేశ్వర రెడ్డి కి ఈశ్వరీ బాయి మెమోరియల్ అవార్డు-2021 ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై…మహిళల హక్కుల కోసం పోరాడిన సాంఘీక వ్యక్తి ఈశ్వరి బాయి అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈశ్వరీ బాయి చేసిన సేవ మరువలేనిదన్నారు. తెలంగాణ గురించి ఎంతగానో ఎదురుచూసిన మహిళ ఈశ్వరీ బాయి అని కొనియాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అప్పుడే భావించిన వ్యక్తి అన్నారు.
ఈశ్వరీ బాయి మహిళలు ఇంటికి మాత్రమే పరిమితమైన రోజుల్లోనే ఇంట్లో నుండి బయటికి వచ్చి సమాజం కోసం కృషి చేసిందన్నారు. ఎంతో మంది మురికివాడల్లో ఉండే పిల్లలకు చదువు నేర్పించిందన్నారు.