రైతులతో రాజకీయం చేస్తున్న బీజేపీ..

109
nama
- Advertisement -

బీజేపీ రైతులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నామా…గత 60వరోజుల నుండి 6 సమావేశాలు నిర్వహించినా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. పైగా బిజెపి నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంట్ ధర్నా కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలసిరావాలన్నారు.

వరిధాన్యం కొనుగోలు పై కేంద్ర మంత్రితో పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలి… కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటన చేయడం మానుకోవాలన్నారు. బీజేపీ ఎంపీలు మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి ఎంపిలు తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రితో ప్రకటన చేయించాలన్నారు.

తెలంగాణ రైతాంగం మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సాక్షిగా కిషన్ రెడ్డి ప్రకటన చేయించాలన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల లెక్కలు లేవని కేంద్రం తప్పించుకోవడం భాధాకరం. తక్షణమైన 25 లక్షల నష్టపరిహారం కేంద్రం ప్రకటించాలన్నారు. గత సంవత్సరం 94 లక్షల 53 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామన్న కేంద్రం ఈ సంవత్సరం మేము కోరిన విధంగా కనీసం 1 కోటి టన్నుల వరిధాన్యం సేకరణ చేయాలన్నారు. తెలంగాణ రైతాంగాన్ని కించపరిచేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారన్నారు.

- Advertisement -