- Advertisement -
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలిపారు గవర్నర్ తమిళి సై. ప్రజా జీవితంలో, సేవలో సుదీర్ఘంగా ఆరోగ్యవంతమైన, ఆనంద దాయకమైన భవిష్యత్తు ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌కి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కరోనా వైరస్ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. ఎవరు కేక్ లు కట్ చేయడం కానీ, సామూహిక వేడుకలను నిర్వహించడం కానీ చేయవద్దని…. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ ను కట్టడి చేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరం చెట్లు నాటుదాం – హరిత తెలంగాణలో భాగస్వామ్యులు అవుదాం అన్నారు.
- Advertisement -