బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా…

205
ravikrishna
- Advertisement -

కరోనా కారణంగా రెండు నెలల అనంతరం ఇటీవలె షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఓ టీవీ సీరియల్ షూటింగ్ సందర్భంగా ఇటీవలె ఓ నటుడిగా కరోనా రాగా తాజాగా మరో నటుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.

తెలుగు బిగ్ బాస్-3 కంటెస్టెంట్, ప్రముఖ సీరియల్ నటుడు రవి కృష్ణ కరోనా భారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు రవికృష్ణ. గత మూడు రోజుల నుండి ఐసోలేషన్ లోనే ఉంటున్నానని…..కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ దేవుడి దీవెనలతో, ఫ్యాన్స్ అభిమానంతో తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు.

తనను కలిసిన వాళ్ళు ముందుగానే టెస్ట్ చేసుకుంటే మంచిదని… తనతో కాంటాక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరు ఐసోలేషన్లోనే ఉండాలని సూచించారు. కరోనా వచ్చిన వారిని వివక్షతతో చూడకండన్నారు.

- Advertisement -