సీఏఏ,ఎన్పీఆర్,ఎన్‌ఆర్‌సీ లకు వ్యతిరేకంగా శాసనసభ ,మండలి తీర్మానాలను స్వాగతిస్తున్నా.ఇందుకు అన్ని పార్టీ లను అభినందిస్తున్నా.టీఆర్‌ఎస్ వైఖరి మొదటి నుంచి లౌకిక వైఖరే అని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ది గంగా జమున తెహజీబ్ సంస్కృతి.సెక్కులరిజంకు టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీ తీర్మానంతో బీజేపీ బెంబేలెత్తి పోయింది అని కర్నె అన్నారు.
అవగాహన లేని బీజేపీ కొత్త అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ను దేశ ద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా రెండో రోజే ప్రజల్లో పలుచ బడ్డారు. ఎన్నో ఏళ్లుగా మత రాజకీయాలతో బీజేపీ దేశాన్ని రావణ కాష్టం గా మారుస్తోంది. దేశంలో విచ్ఛిన్న కరమైన రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోడీ యే దేశ ద్రోహి అని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సెక్కులరిజానికి దేశం నిజమైన బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ యే అని.. కేంద్ర బీజేపీ పెద్దలు దేశద్రోహానికి పాల్పడుతున్నారు కనుకే సీఏఏ కు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేశామన్నారు.
సీఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న అన్ని రాష్ట్రాలు దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయా ? అని ప్రశ్నించారు. బీజేపీ బీహార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. బీజేపీ నేత సుశీల్ మోడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. బీహార్ బీజేపీ నేతలు కూడా దేశ ద్రోహులేనా ?…పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉన్నట్టే శాసనసభకు విశేష అధికారాలుంటాయని బీజేపీ నేతలు గ్రహించాలి అన్నారు.
సీఏఏ పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడక పొతే కేసీఆర్ దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ను బీజేపీ నేతలు దేశ ద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు సహించరు. మత పరమైన ఘర్షణలను ఎవరూ రెచ్చగొట్టినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపేక్షించదు. బీజేపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు మాని దేశద్రోహంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కేసీఆర్ దేశభక్తిపై బీజేపీ నేతల సర్టిఫికెట్స్ అక్కరలేదని కర్నె ప్రభాకర్ ఎద్దేవ చేశారు.