ఇండియాలో రూ.20 నాణెం విడుదల కాబోతుంది. ఈ నాణేన్ని త్వరలో విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ.10 నాణెం మాదిరి కాకుండా… రూ.20 నాణేన్ని సరికొత్తగా తీసుకొస్తున్నారు. 2009 మార్చిలో రూ.10 నాణేన్ని చలామణిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ నాణెం రూపురేఖల్లో మార్పులు చేస్తూ మొత్తం 14 డిజైన్లలో విడుదల చేశారు. ఈంతేకాదు ఆ మధ్య రూ.10 నాణేలు చెల్లవంటూ వదంతులు కూడా వచ్చాయి. ఈ వదంతునలను గతేడాది ఆర్‌బీఐ కొట్టిపారేసింది. చలామణిలో ఉన్న 14 రకాల రూ.10 నాణేలు చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.20 నాణేన్ని విడుదల చేయనున్నారు.
ఇక ఈ కొత్త నాణెం విశేషాలు తెలుసుకుందాం.. ఈ కొత్త రూ. 20 నాణెం 27 మిమీ వ్యాసంతో నాణెం ముఖ భాగంపై అశోక స్థూపంపై ఉండే సింహాన్ని కలిగి కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. భారత్ అన్న హిందీ అక్షరాలు దీనిపై ఉంటాయి.. ఈ నాణేనికి రెండు రింగులు ఉంటాయి. వెలుపలి రింగ్‌ను 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో తయారు చేస్తుండగా… లోపలి రింగ్ ను 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో తయారు చేయారు చేస్తున్నారు. ఈ నాణేనికి 12 అంచులు ఉంటాయని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ కాయిన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఆర్థిక శాఖ ఇంకా వెల్లడించలేదు.