శబరిమలకు రూ.100కోట్ల ఆదాయం

381
Sabarimala
- Advertisement -

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నవంబర్ 17న శబరిమల ఆలయం తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఆలయం తెరుచుకున్న 28రోజుల్లోనే గతంలో కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది. 28 రోజుల్లో భక్తులు హుండీలో వేసిన డబ్బుతోసహా ఇప్పటికే రూ.104 కోట్ల ఆదాయం వచ్చింది.

2018లో ఆలయం తెరిచిన 28 రోజుల్లో రూ.64 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. హుండీలో నాణేల ద్వారా రూ.5 కోట్ల ఆదాయం రాగా… అన్నదానం, ప్రసాదాల అమ్మకం ద్వారా మొత్తం రూ.104 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ట్ దేవస్థాన ట్రస్ట్ తెలిపింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం గతేడాది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -