లంకలో ప్రత్యక్షమైన రాజపక్స..

168
rajapakse
- Advertisement -

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశం విడిచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి స్వదేశం చేరుకున్నారు. మ‌ళ్లీ స్వ‌దేశానికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు మంత్రులు, రాజ‌కీయ‌వేత్త‌లు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద స్వాగ‌తం ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

జూలై నెల‌లో మిలిట‌రీ స‌హాయంతో రాజ‌ప‌క్ష దేశాన్ని విడిచి వెళ్లారు. ఆర్థిక సంక్షోభాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో అధ్య‌క్ష భ‌వ‌నాన్ని చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోట‌బ‌య బ్యాంకాక్ నుంచి సింగ‌పూర్ మీదుగా లంక చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న ఓ థాయిలాండ్ హోట‌ల్‌లో ఉన్నారు.

- Advertisement -