ఓటీఎస్ పేరుతో నిర్బంద వసూళ్లు: గోరంట్ల బుచ్చయ్య

29
buchaiah chowdary

ఏపీ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో నిర్బంద వసూళ్లకు పాల్పడుతుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్స్ చేశారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి..అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఒటిఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం అన్నారు.

మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కే సవాల్ చేస్తున్నాను..నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాము.. నిరూపిస్తే ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చిన నాబార్డ్, హడ్కో, ఇతర బ్యాంకులు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. హక్కు పత్రాలు ఇవ్వడానికి మీరెవరు.. ఫోటోలు పెట్టుకుని ప్రజలను బ్లఫ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.