సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం..

31
jagan

ఏపీ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం వైఎస్‌ జగన్‌ విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సైనిక్‌ వెల్‌ఫేర్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు.

ఈ సందర్భంగా సీఎం కి జ్ఞాపిక అందజేశారు బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.