హీరో గోపీచంద్ స్టైలిస్, మాస్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గౌతమ్‌నంద’. ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. టీజర్‌లో గోపీచంద్ లుక్ అదిరిపోయింది. చిన్న గడ్డంతో స్టైలిస్‌గా కనిపిస్తూ.. ఎప్పుడులానే నేచురల్ గెటప్‌లో రౌడీల భరతం పడుతున్నాడు.
మనకు టీజర్‌లో ఇద్దరు గోపీచంద్‌లు కనిపిస్తున్నారు. ఒకరు బాగా రిచ్ పర్సన్. ఫారన్‌లో అందమైన అమ్మాయిల మధ్య ఎంజాయ్ చేస్తున్నాడు. మరొకరు యంగ్ అండ్ ఎనర్జటిక్. స్వదేశానికి వచ్చి రౌడీలను వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు.
ఫారన్‌లో తన అందమైన ప్రపపంచంలో విలాసాలతో తూగిపోయిన ఓ కుర్రాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. ఎలా మారాడు.. అనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో హన్సిక మధ్యతరగతి అమ్మాయిగా, కేథరీన్ డబ్బున్న అమ్మాయిగా కన్పిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలు, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అంటూ సాగే నేపథ్యసంగీతం హైలైట్‌గా నిలిచాయి. ఈచిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.