హీరో గోపిచంద్ చాణక్య సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటివలే విడుదలైన ఈమూవీ ట్రైలర్ ప్రేక్షకులను అకట్టుకుంటుంది. తమిళ దర్శకుడు తిరు ఈమూవీకి దర్శకత్వం వమించగా మెహరిన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు జరీన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 5న ఈమూవీ విడుదల కానుంది.
కాగా ఈమూవీ తర్వాత గోపిచంద్ మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తైంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈమూవీలో గోపిచంద్ సరసన తమన్నా నటించినుంది. తాజగా ఈమూవీపై ఖరారయ్యిందని తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే మాస్ టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు చిత్రయూనిట్.