అంతరిక్షంలో కృత్రిమ మేధ (AI) కంప్యూటింగ్ మౌలిక వసతులను పరీక్షించేందుకు గూగుల్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమం ద్వారా ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’ పేరుతో చేపడుతున్న ఈ వినూత్న ప్రతిపాదనను గురువారం వెల్లడించారు.
అంతరిక్షంలో ఉండే కఠినమైన వాతావరణంలో గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్’ (TPU) ప్రాసెసర్లను పరీక్షించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం.అంతరిక్షంలో నిరంతరం లభించే సౌరశక్తి (సూర్యకాంతి) సహాయంతో పనిచేసే అత్యంత సమర్థవంతమైన క్లౌడ్ మౌలిక వసతులను ఏర్పాటు చేసే అవకాశాలను గూగుల్ రీసెర్చ్ బృందం పరిశోధిస్తోంది.
ఈ ప్రయోగం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో భూమిపై విద్యుత్ వాడకం మరియు శక్తి భారాన్ని తగ్గించడంతో పాటు, అంతరిక్షంలోనే సేకరించే సమాచారాన్ని అక్కడికక్కడే (On-orbit) వేగంగా విశ్లేషించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read;బాలాపూర్ లడ్డూ చరిత్ర…
సాంకేతిక రంగంలో అంతరిక్ష ఆధారిత ఐటి మౌలిక వసతుల దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగు అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

