గంగమ్మ ఒడికి లంబోదరుడు

2
- Advertisement -

హైదరాబాద్‌లో నవరాత్రుల పాటు కోలాహలంగా సాగిన గణేశ్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం హుస్సేన్‌సాగర్‌లో అత్యంత వైభవంగా మరియు కన్నులపండువగా పూర్తయింది.

శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ మండపం వద్ద పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం, బడా గణనాథుడిని భారీ టస్కర్ (ట్రాలీ) వాహనంపైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు.

భక్తుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనల నడుమ బడా గణనాథుడి ఊరేగింపు సాగింది. టెలిఫోన్ భవన్, పిఎసిసి, సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు శోభాయాత్ర చేరుకుంది.

ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పూజలు మరియు హారతి నిర్వహించారు. ఆ తర్వాత భారీ బాహుబలి క్రేన్ సహాయంతో విగ్రహాన్ని క్రమంగా హుస్సేన్‌సాగర్ జలాల్లోకి దించి నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వేలాది మంది పోలీసులు, సీసీ కెమెరాల నిఘా, డ్రోన్ల పర్యవేక్షణ మధ్య శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించారు.‘గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తు జల్దీ ఆ’ అంటూ లక్షలాది మంది భక్తులు అశ్రునయనాల నడుమ స్వామివారికి వీడ్కోలు పలికారు.

Also Read:ఈసారి CJP టార్గెట్..ఎన్నికల కమిషన్!

- Advertisement -