- Advertisement -
తెలంగాణలోని ఏ ఒక్క ఆడబిడ్డ కూడా సిజేరియన్లు చేసుకొరాదన్న ముఖ్యమంత్రి సంకల్పంను మంత్రి హరీష్ రావు నిజం చేసి చూపించారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన పోచయ్య తన కూతురు వసంత సర్కార్ దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్ని పోచయ్యకు పోస్టు కార్డు ఉత్తరం ద్వారా మంత్రికి తెలియజేశారు.
సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్కారు దవాఖానకు మా బిడ్డను ప్రసవం కొసం తీసుక పోయిన అక్కడి వైద్యులు చూసి...వారు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దామన్నారు. సాధారణ కాన్పు ద్వారా మా బిడ్డకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ ఆసుపత్రిని మా కేటీఆర్ బాగా చేసారు. అక్కడ డాక్టర్ లు మంచిగ చూసి, ఓపికతో సాధారణ కాన్పు చేశారాని ఉత్తరంలో పెర్కోన్నారు.
మీరు( హరీశ్ రావు) టీవీల్లో చెప్పారు కదా.. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు.. పైగా కేసీఆర్ కిట్ ఇస్తారని.. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనం లో ఇంట్లో దింపుతారని.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు, బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యం తో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను…సార్ అంటూ పోచయ్య మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం రాశారు.
- Advertisement -