- Advertisement -
గురువారం ప్రగతి భవన్లో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కేటీఆర్‌ను కంపెనీ ఇండియా హెడ్ గుంజన్ సంతాని, సీఈవో రవి కృష్ణన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీఎల్ లిమిటెడ్ ఎండీ నరసింహా రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీ రాబోయే మూడేండ్లలో 2500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -