- Advertisement -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. వరుసగా 4వ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.51,870కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.47,550కి చేరింది.
బంగారం బాటలోనే వెండికూడా బారీగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 2000 తగ్గి రూ.57,000కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.42 శాతం క్షీణతతో 1868 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 23.08 డాలర్లకు చేరింది.
- Advertisement -