సింగరేణిలో మొక్కలునాటిన ఫైనాన్స్ డైరెక్టర్‌ బలరాం..

240
singareni

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 550 మొక్కలను నాటారు న సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమి ఖని ఓపెన్ కాస్ట్ ప్రదేశంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం గారు ఈరోజు స్వతహాగా అతనొక్కడే 6 రకాల 550 మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు సమాజానికి ఉపయోగపడే చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారని అతని కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత సంవత్సరం కూడా మేము 6500 మొక్కలు నాటడం జరిగిందన్నారు.

ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మొక్కలునాటాలని అనుకున్నము కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల చేపట్టలేక పోయాం . అయినప్పటికీ ఈ సంవత్సరం పూర్తయ్యే సరికి పదివేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈరోజు నేనొక్కడినే స్వతహాగా 6 రకాల 550 మొక్కలను నాటడం జరిగింది అని తెలిపారు.

ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా వాతావరణ కాలుష్యం లేకుండా ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందో అక్కడ జీవన ప్రమాణం పెరుగుతుంది అది మనుషులు అయినా జంతువులైన పక్షులు అయిన మన భవిష్యత్ తరాలకు మనం ఏదన్న ఇవ్వాలనుకుంటే అది మంచి వాతావరణమే అని కాబట్టి బాధ్యతగా మనందరం మొక్కలు నాటి వాటిని సంప్రదించాలని తెలిపారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ఏరియా లో పచ్చదనం పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచడం కోసం సింగరేణి తరఫున కృషి చేస్తామని అన్నారు. ఈ యొక్క ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన GM నరసింహ రావు ;TBGK ఉపాధ్యక్షులు రజాక్; పి ఓ వెంకట్రాంరెడ్డి; మేనేజర్ కర్ణాకర్; ప్రాజెక్ట్ ఇంజినీర్ సత్యనారాయణ; అదేవిధంగా మిగతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.