భగ్గుమన్న బంగారం…

208
gold rate today
- Advertisement -

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. శ్రావణమాసం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరిగి 52,200కు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరుగుదలతో రూ.47,850కు చేరింది.

కేజీ వెండి ధర ఏకంగా రూ.3350 పెరిగి రూ. 58,950కు చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.48,750కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరుగుదలతో రూ.49,950కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 1872 డాలర్లకు ఎగసింది.

- Advertisement -