వరుసగా మూడోరోజు దిగొచ్చిన బంగారం!

176
gold price
- Advertisement -

గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడోరోజు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి 58,300గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.53,140గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి 53450గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 650 తగ్గి 54700కి చేరింది.

పసిడి బాటలోనే వెండికూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2650 తగ్గి రూ.72,500కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 1930 డాలర్లుగా ఉంది.

- Advertisement -