కరోనా ఎఫెక్ట్‌: పతనమైన పసిడి ధర..!

359
gold
- Advertisement -

పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గుతూ వచ్చింది. బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర మంగళవారం ఏకంగా 1.2 శాతం మేర దిగొచ్చింది. దీంతో పది గ్రాముల మేలిమి బంగారం దాదాపు 400 రూపాయల వరకూ తగ్గింది.

హైదరాబాద్ లో బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 420 రూపాయల తగ్గుదలతో 43,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల తగ్గుదలతో 41,020 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు నిన్నటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,520 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదలతో 43,175 రూపాయలు నమోదు చేసింది. వెండి ధర కేజీకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. దీంతో 40 వేల మార్కు కంటే దిగువనేకేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దనిలిచింది.

కరోనా భయంతో మార్కెట్లలో ఒడిదొడుకులు నెలకొంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు క్రూడ్ ధరలు కూడా పడిపోతుండటంతో..ఇన్వెస్ట్‌మెంట్‌పై లోతైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో గోల్డ్ రేట్లు పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -