60 వేలకు చేరువలో పసిడి!

35
- Advertisement -

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలోనే 60 వేలకు చేరువలో పసిడి ధరలు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.53,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470గా ఉంది. ఢిల్లీలో సైతం బంగారం భారీగా పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర పెరిగి రూ.53,750కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,610కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1800 పెరిగి రూ.77,800 కు చేరింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1400 పెరిగి రూ.74,700కి చేరాయి. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.1800 పెరిగి రూ.77,800 మార్కు వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -