బంగారం అంటే ఇష్టపడని వారుండరూ. ముఖ్యంగా ఇండియన్స్ బంగారం ప్రియులు. ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే ఫస్ట్ అందరూ ఆలోచన చేసేది బంగారం గురించే. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజురోజుకి పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.60 వేలకు చేరుతుందని నిపుణులు చెప్పారు కానీ మార్చిలోనే బంగారం ధర రూ.60 వేలకు చేరువైంది.రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో పసిడి ఇక ప్రియమే కానుంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,780గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,780, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,430గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,930గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.75,400,విశాఖలో కేజీ వెండి ధర రూ.75,400,విజయవాడలో కేజీ వెండి ధర రూ.75,400, చెన్నైలో కేజీ వెండి ధర రూ.75,400,ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.72,600గా ఉంది.
ఇవి కూడా చదవండి..