గోవాలో స్పీకరే సీఎం

222
PramodSawant
- Advertisement -

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్లేస్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే దానిపై గోవా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తాజాగా గోవాకు ముఖ్యమంత్రిని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఆ రాష్ట్ర స్పీకర్ ప్రమోద్ సావంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్ పారికర్ అంత్యక్రియలు ముగియగానే ప్రమోద్ సావంత్ పేరును ఖరారు చేశారు. ఈసందర్భంగా అర్ధరాత్రి 2గంటలకు ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మ‌హారాష్ట్ర‌వాది గోమాంత‌క్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ద‌వ‌లిక‌ర్‌లు ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్‌లో మ‌రో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్ మైఖేల్ లోబో .. ఇప్పుడు స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రమోద్ పాండురంగ్ సావంత్ గత కొన్నేండ్లలో రాజకీయ నేతగా ఎంతో దూరం ప్రయాణించారు. ప్రస్తుతం గోవా శాసనసభ స్పీకర్‌గా పనిచేస్తున్న సావంత్.. ముఖ్యమంత్రి పదవి కోసం తన సహచర బీజేపీ నేతలు వినయ్ టెండూల్కర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు.

- Advertisement -