తారకరత్నకు మీ ఆశీస్సులు కావాలి..

56
- Advertisement -

నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుండెపోటుతో నటుడు తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తుండగా నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న తారకరత్నను అన్న కళ్యాణ్‌ రామ్‌తో కలిసి పరామర్శించారు ఎన్టీఆర్.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఎన్టీఆర్.. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులు అందరి ఆశీస్సులు తారకరత్నకు కావాలని కోరారు.తారకరత్న ప్రాణాలతో పోరాడుతున్నారని…తాను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశానని.. కొంత రెస్పాన్స్‌ కనిపించిదని చెప్పారు.

తారకరత్న ఎక్మోపై లేరని..ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎందరో అభిమానుల ఆశీర్వాదం తారకరత్నకు ఉందని.. తొందరలోనే కోలుకుంటారని ఎన్టీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -