మరో ఛాన్స్‌ ఇవ్వండి -జూకర్ బర్గ్‌..

185
"Give Me Another Chance," Says Mark Zuckerberg On
- Advertisement -

కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా సంస్థ కొన్ని లక్షల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల అకౌంట్లను వాడుకోవడంతో నెటిజన్లు ఫేస్ బుక్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. డిలీట్‌ఫేస్‌బుక్‌ అంటూ హాష్‌టాగ్ కూడా జోడించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే భారత్‌ లో 5.6 లక్షల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల డేటాను కేంబ్రిడ్జ్‌ వాడుకుందని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

  "Give Me Another Chance," Says Mark Zuckerberg On

తాజాగా భారత ప్రభుత్వం పంపిన నోటీసుకు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాతో సహా వివిధ దేశాల్లో ఆ యాప్‌ ఎంత మంది యూజర్ల డేటా వాడుకుందో తెలుసుకునే పనిలో ఉన్నామని, గ్లోబల్ సైన్స్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌కు చెందిన అలెగ్జాండర్‌ కోగన్‌ తయారు చేసిన యాప్‌ ద్వారా ఫేస్‌బుక్‌ డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంపాధించిదని తెలిపారు.

తమ అనుమతి లేకుండా డేటాను వాడుకోవడం ఉల్లంఘనే అవుతుందని తెలిపింది ఫేస్‌బుక్‌. అయితే అలెగ్జాండర్‌ కోగన్‌ తయారు చేసిన యాప్‌ను కేవలం 335 మంది మాత్రమే ఇన్‌స్టాల్‌చేసుకున్నారని, కానీ ఇది వాళ్ళ స్నేహితుల ద్వారా ఓ చెయిన్‌లా మారి 562120 మందిపై ప్రభావం చూపిందని తెలిపింది.

మొత్తం 562455 మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా కేంబ్రిడ్జ్ అనలిటికా చేతికి వెళ్లింది అని ఫేస్‌బుక్ తెలిపింది. మరోవైపు తమవైపు నుంచి తప్పు జరిగినా తనకు మరో అవకాశం ఇవ్వాలని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ కోరారు.

- Advertisement -