- Advertisement -
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు కమిషనర్ లోకేశ్ కుమార్. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నామని…ఇందుకోసం ఇప్పటివరకు రెండు వేల మంది వాలంటీర్లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
మరింత మంది వలంటీర్లు అవసరమని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మైజీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
- Advertisement -