ట్రెండింగ్‌లో గెట్ అవుట్ మోడీ!

12
- Advertisement -

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా #GetOutModi హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ఎక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్‌గా నిలిచిన ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటివరకు 1.47 లక్షల‌కు పైగా పోస్టులు షేర్ అయ్యాయి.

ఈ వైరల్ నిరసనకు కారణం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మూడు భాషల విధానాన్ని అమలు చేసేంతవరకు తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు అందించేది లేదని స్పష్టం చేశారు.

అయితే దీని పై ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందిస్తూ… మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే, మోదీ తమిళనాడు వచ్చినప్పుడు ‘గో బ్యాక్ మోదీ’ కాదు, ‘గెట్ అవుట్ మోదీ’ నినాదాలు వినిపిస్తాయి అన్నారు.

Also Read:కోమటిరెడ్డి మనిషిలా మాట్లాడటం లేదు!

ఈ నిరసన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే డీఎంకే శ్రేణులు, బీజేపీకి వ్యతిరేక వర్గాలు ఈ ట్రెండ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నుండి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన రాలేదు. అయితే, గతంలో ‘Go Back Modi’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా తమిళనాడులో మోదీ పర్యటనల సమయంలో ట్రెండ్ అయ్యాయి.

- Advertisement -