కోమటిరెడ్డి మనిషిలా మాట్లాడటం లేదు!

10
- Advertisement -

కోమటి రెడ్డి మీడియా తో మాట్లాడే ముందు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆయన నోట్లో పైపు పెట్టాలి….కోమటి రెడ్డి ఓ మనిషిలా మాట్లాడటం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఏపీ నీటి దోపిడీతో తెలంగాణ లో సాగు ,తాగు నీళ్లకు కటకట ఏర్పడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు….హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ చెత్త మాటలు మాట్లాడారు అన్నారు.

రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు ..ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ లోనూ అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ లే ..చంద్రబాబు ,రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ ,బీజేపీ లే తెలంగాణ కు సరైన నీటి వాటా దక్కక పోవడానికి కారణం అన్నారు. ఉత్తమ్ కుమార్ ఎవరో రాసిచ్చింది చదివారు ..రేవంత్ రెడ్డి తిట్లతో సీఎం అయ్యారు .తాను కూడా అదే భాష తో మాట్లాడితే సీఎం అవుతా అని ఉత్తమ్ అనుకుంటున్నారేమో అన్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలన లోసాగు తాగు నీళ్లకు ఎలాంటి కష్టం వాటిల్ల లేదు..రేవంత్ రెడ్డి మాట్లాడిన చెత్తనే ఉత్తమ్ కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు అన్నారు. ఉత్తమ్ మాట్లాడాల్సింది కేంద్రం మీద పక్క రాష్ట్రం చంద్రబాబు మీద ..ఏపీ లో ప్రాజెక్టుల మీద జగన్ ,చంద్రబాబు ఒకే వైఖరి మీద ఉన్నారు అన్నారు. తెలంగాణ లో మాత్రం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు …పోతిరెడ్డి పాడు ను వ్యతిరేకించి ఆనాడు మా పార్టీ వై ఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చింది ..మాట్లాడుకుంటే కాంగ్రెస్ తెలంగాణ కు చేసిన ద్రోహ చరిత్ర చాలా ఉంది ..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్ అంటున్నారు ..ముందు ఉన్న పంటలను కాపాడటం పై దృష్టి పెట్టాలి …మోడి కి చంద్రబాబు కు ఉత్తమ్ భయపడుతున్నారు అన్నారు.

Also Read:హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

- Advertisement -