ప్లాస్టిక్ తెచ్చివండి..పసిడి తీసుకెళ్లండి

60
- Advertisement -

ప్లాస్టిక్ భూతంపై పోరాటానికి అంత సిద్ధం అవుతున్నారు. ప్రజల్లో కాసింత అవగాహన రావడంతో ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు ముందుకొస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్లాస్టిక్‌ను అంతం చేసేందుకు రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని ఓ కుగ్రామం ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించేందుకు ప్లాస్టిక్ ఇవ్వు .. బంగారం తీసుకో అనే నినాదంతో పంచాయతీ చేపట్టిన కార్యక్రమంతో 15 రోజుల్లోనే గ్రామం ప్లాస్టిక్ రహితంగా మారిపోయింది. అనంతనాగ్ జిల్లాలోని హిల్లర్ షాబాద్ బ్లాక్ లో ఉన్న ఆ ఊరి పేరు సాదివార.

పర్యావరణాన్ని కాపాడేందుకు ఆ గ్రామపంచాయతీ సర్పంచ్ పారూక్ అహ్మద్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. న్యాయవాది అయిన ఫారూక్ ప్లాస్టిక్ ను ఎలాగైనా తన గ్రామం నుంచి నిర్మూలించాలని భావించారు. దీంతో ప్లాస్టిక్ ను తెచ్చుకోండి.. బంగారం తీసుకెళ్లండంటు గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

20 క్వింటాళ్ళ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి బంగారు బిళ్ళను ఇవ్వటం మొదలుపెట్టారు. దీంతో గ్రామస్తులు వీధిలో తిరుగుతూ ప్లాస్టిక్ ను సేకరించడం మొదలు పెట్టారు. మంచి ఫలితం రావడంతో అధికారులు సాదివార గ్రామాన్ని స్వచ్ఛభారత్ అభియన్ 2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు.ఈ విధానంతో గ్రామమే కాకుండా సమీపంలోని నదులు,వాగులు కూడా శుభ్రమయ్యాయని సర్పంచ్ ఫారూక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -