తెలంగాణలో అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన ప్రదేశమని మంత్రి కేటీఆర్ అన్నారు. చెన్నైలో ఉన్న జర్మనీ కాన్సులేట్‌లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచర్ల మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు తొలి సారి విజిట్ చేసిన కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్‌కు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మైఖేల్ కేటీఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించుకున్నారు.
తెలంగాణ, జర్మనీ మధ్య ప్రాధాన్యత రంగాల సహకారం గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆవిష్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై జర్మనీ కౌన్సుల్ జనరల్‌తో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.
దేశంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్న కార్మికుల్లో తెలంగాణ అయిదో రాష్ట్రంగా నిలుస్తుందని కౌన్సుల్ జనరల్ కీర్తించారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకున్నట్లు జర్మనీ కౌన్సులేట్ పేర్కొన్నది. మంత్రి కేటీఆర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం అయినట్లు జర్మనీ కౌన్సుల్ జనరల్ తన ట్వీట్‌లో వెల్లడించారు.
Minister @KTRTRS welcomed the new CG of Germany in Chennai Ms Michaela Küchler @GermanyChennai on her first visit to Hyderabad. Discussed about strengthening cooperation between Telangana and Germany in priority sectors like innovation, sustainable mobility, MSME and skilling. pic.twitter.com/OH4uw6LTTd
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 16, 2022
Great business opportunities for 🇩🇪companies in Telangana and Hyderabad. Central state with connections to all 🇮🇳. 5th largest city of 🇮🇳with highly skilled workers. Specialist in Life sciences and production if vaccines. Fruitful talk with @KTRTRS @MinisterKTR pic.twitter.com/2HA5j2HSfT
— German Consul Chennai (@GermanyChennai) November 16, 2022
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో జాకీ గార్మెంట్…కేటీఆర్
బీజేపీ మళ్లీ వస్తే దేశం సర్వనాశనం:డి.రాజా
జూ.ఎన్టీఆర్@ 22యేళ్లు