గ్రీన్ ఇండియా ఛాలెంజలో పాల్గొన్న జెన్ కో సీఎండీ..

182
Prabhakar Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వినూత్న రీతిలో ముందుకు కొనసాగుతుంది. ఈ రోజు దామచర్లలోని యాదాద్రి తాప విద్యుదుత్పత్తి కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసిన ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకొని రావటం జరుగుతుంది అని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ కి, వారి బృందానికి అభినందనలు తెలియజేశారు.

ఇప్పటి‌ నుండి మా సంస్థలో ఏ స్టేషన్‌ను సందర్శించిన మొదటగా మొక్కలు నాటుతానని ప్రకటించారు. సంస్థ ఉద్యోగస్తులు అందురు కూడ దీనిని పాటించి మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్స్, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -