డిగ్రీ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం…టీఆర్ఎస్వీ హర్షం

270
gellu srinivas yadav
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలో డ్రాపౌట్స్ తగ్గాలని పేద విద్యార్థులకు భారం కాకూడదని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు రెండు లక్షల 80 వేల ఐదు వందల తొమ్మిది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతించారు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్‌…భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేదన్నారు.

టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ కి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి, టిఆర్ఎస్వి పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -