కేంద్రబడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం: గెల్లు శ్రీనివాస్

54
Gellu Srinivas yadav
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రాష్ట్రం కు,విద్యారంగం తో పాటు ఇతర రంగాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం అన్యాయం చేసిందని టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆధ్వర్యంలో.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన ధర్నా…. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.. చేసేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం కు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు అలసత్వం వహించిందన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వవలసిన.. విద్యా సంస్థలకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించలేదని…తెలంగాణ రాష్ట్రం కు బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యాయం చేస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తెలంగాణ రాష్ట్రం కు విద్యారంగంలో కేటాయింపులు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

- Advertisement -