గేల్ షాకింగ్‌ డేసిషన్‌..!

260
gayle
- Advertisement -

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్‌లో జరుగబోయే ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. గేల్ నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించింది విండీస్ బోర్డు.

బోర్డుతో వివాదాల కారణంగా గేల్ జాతీయ జట్టుకు పెద్దగా ప్రాతినిధ్యం వహించడం లేదు. గతేడాది జూలైలో చివరిసారిగా గేల్ వన్డే ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు.

1999లో భారత్‌ జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గేల్ అనతికాలంలో హార్డ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. విధ్వంసక ఓపెనర్‌గా విండీస్ జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ఇప్పటివరకు 284 మ్యాచ్‌లు ఆడిన గేల్ ఒక డబుల్ సెంచరీ,23 సెంచరీలతో 9,727 పరుగులు చేశాడు.

ఇక పొట్టిక్రికెట్‌ ఫార్మాట్‌లో గేల్‌ మెరుపులు మరువలేం. సిక్సర్ల సునామీతో క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లను ఉచకోతకోసే గేల్‌..ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచెత్తో గెలిపించిన గేల్‌ బాల్‌తోనూ మ్యాజిక్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు బీపీఎల్, సీపీఎల్ టోర్నీలో ఆడుతున్నాడు.

- Advertisement -