పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. అవును ఇది నిజం 40యేళ్లుగా మాన్యువల్ స్కావెంజర్‌గా పనిచేసిన చింతాదేవి బీహార్‌లోని గయ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. పౌర సంస్థల ఎన్నికలలో చింతాదేవి ఎన్నికయ్యారు.
గతంలో కూడా ఇదే నగరం నుంచి ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీదేవి 1996లో జేడీయూ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్‌గా వెళ్లారు. తాజాగా చింతాదేవి ఎన్నిక కావడంతో మరోసారి గయ ఓటర్లు అట్టడుగు వర్గాల ప్రజలను కూడా ఎన్నుకొంటారని మరోసారి రుజువు చేశారు. అయితే ఈమె మద్దతుగా మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా ఆమెకు మద్ధతు తెలిపారు.
చింతాదేవి పారిశుద్ధ్య కార్మికురాలే గాకుండా కూరగాయలు కూడా అమ్మి జీవనం సాగిస్తుంది. అట్టడుగు వర్గానికి చెందిన మహిళ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం చరిత్రాత్మకమని గయ మేయర్ గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి…