ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్..

314
gambir
- Advertisement -

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తనదైన శైలీలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ,మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ..మాటలు ఆపి, పని మొదలు పెట్టాలని చురకలంటించాడు. ఈగోల‌కు పోకుండా, ఆప‌ద‌లో ఉన్న పేదలకు ఆదుకోవాలన్నారు.

క‌రోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు గాను 50 లక్షల రూపాయల సొంత నిధులను గంభీర్ ప్రకటించాడు. అనంతరం ఎంపీలాడ్స్ నిధుల నుంచి మరో 50 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇదిఇలా ఉండగా భారత్‌లో 4 వేల మందికి పైగా కరోనా బారీన పడ్డారు. వంద మందికి పైగా మృత్యువాత పడగా 11 రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్‌లుగా గుర్తించింది కేంద్రం.

- Advertisement -