అంకుశం, మగాడు, అగ్రహం వంటి తెలుగు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో రాజశేఖర్. ఒకప్పుడు టాలీవుడ్‌లో హిట్ కేరాఫ్‌గా నిలిచిన ఈ యాంగ్రీ మేన్ గత పదిహేను సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు.అంతేగాదు వరుస ఫ్లాప్‌లతో ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్ధితి వచ్చింది.
ఇలాంటి సమయంలో రాజశేఖర్‌కి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. చందమామ కథలు, గుంటూరు టాకీస్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ సరికొత్త ప్రయోగం గరుడవేగతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.
శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేగాదు రివ్యూలు సైతం సినిమాకు పాజిటివ్ కావడంతో తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది. దీనికి తోడు బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మరే సినిమా పోటీ లేకపోవడంతో నిర్మాతలకు లాభాల పంట పండటం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా గరుడవేగతో రాజశేఖర్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు.