అప్పుల ఊబిలో సీనియర్ హీరో

25
- Advertisement -

సినిమా హీరో అనగానే కోట్ల సంపాదన అనుకుంటాం. సినిమా హీరోల మీద ఎప్పుడూ అభిమానుల అభిమానంతో పాటు డబ్బుల వర్షం కురుస్తూ ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటాయి. హీరో రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. ఇప్పటికే, హీరో రాజశేఖర్ కి సుమారు పదిహేను కోట్లకు పైగా అప్పులు వున్నాయట. ఆ అప్పులకు కారణం ఆయన చేసిన సైడ్ బిజినెస్ అని తెలుస్తోంది. అయితే, సినిమా వాళ్ళ అప్పులకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. హీరో రాజశేఖర్ కి వడ్డీలు పెరిగి పెరిగి ఏడాదికి కోటి రూపాయల వరకు వడ్డీనే కడుతున్నాడట.

అందుకే చకచకా సినిమాలు చేయడానికి హీరో రాజశేఖర్ ముందుకు వస్తోన్నా.. ఛాన్స్ లు ఇచ్చేవారు కరువయ్యారు. దాంతో, ఆ మధ్య చెన్నై వెళ్లారు. అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టి సక్సెస్ అయిపోవాలని. కానీ.. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మొత్తానికి రాజశేఖర్ కు ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయాయి. అందుకే సైడ్ రోల్స్ అయినా చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి హీరో అవ్వడం ఎంత కష్టమో, ఆ హీరో ఇమేజ్ ను మెయింటైన్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. ప్రస్తుతం హీరో రాజశేఖర్ విషయంలో ఇది మరోసారి రుజువు అయ్యింది.

Also Read:ఎన్డీయేకు 400 సీట్లు పక్కా : మోడీ!

- Advertisement -