ఎన్టీఆర్‌ కోసం మరో కథ సిద్ధమైంది..!

227
Dil Raju With NTR
- Advertisement -

టెంపర్‌, నాన్నకు ప్రేమతో,జై లవకుశ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ తన నెక్ట్స్‌ సినిమాలపై దృష్టిసారించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెండు నెలల సమయం ఉండటంతో   ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ చిత్రాల కోసం మరిన్ని కథల్ని వింటున్నాడట. చాలా రోజులుగా ఎన్టీఆర్- దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ప్రచారం జరిగిన అదిమాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం టీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం  దిల్ రాజుకు సంబంధించిన నిర్మాణ సంస్థ తార‌క్ కాల్షీట్లు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది శతమానం భవతి వంటి ఫ్యామిలీ చిత్రంతో దిల్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చిన దర్శకుడు సతీష్‌తో ఎన్టీఆర్ సినిమా ఉండనుందని టాలీవుడ్ కోడై కూస్తోంది.  అయితే తార‌క్‌తో డీల్‌ ఫైన‌ల్ అయ్యిందా? లేదా?  తెలియదు కానీ అన్ని కుదిరితే దిల్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రావడం పక్కా అని ఫిల్మ్‌ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -