TTD: గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారు

30
- Advertisement -

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

వాహనసేవలో తిరుమల పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు సుబ్బరాజు, యానాదయ్య , జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఇతర ఆధిరులు పాల్గొన్నారు.

Also Read:ముసుగులో దోస్తీ.. ఇంకెన్నాళ్ళు?

- Advertisement -