‘గరివిడి లక్ష్మి’..బ్యూటీఫుల్ మూవీ

10
- Advertisement -

ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని హీరో తేజ సజ్జా అన్నారు. ఈ సినిమా చూస్తుంటే థియేటర్‌లో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఆస్వాదిస్తున్నట్లుగా ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా థియేటర్లలో చూడాలని కోరారు. గురువారం నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గరివిడి లక్ష్మి పాత్రను ఆనంది పోషిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించగా, టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బుర్రకథ ద్వారా వేలాది మందిని అలరించిన గరివిడి లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

తేజ సజ్జా మాట్లాడుతూ.. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, గరివిడి లక్ష్మి అభిమానులకు గౌరవాన్ని తీసుకొస్తుందని అన్నారు. చిత్రాన్ని చూసిన పలువురు భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ సినిమా ఉత్తరాంధ్ర కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. స్థానిక జానపద కళలకు మళ్లీ ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా చిత్రబృందాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. గరివిడి లక్ష్మి పాత్ర ఆనందికి మంచి గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. దర్శకుడు గౌరి నాయుడు మాట్లాడుతూ, సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.

ఆనంది మాట్లాడుతూ.. గరివిడి లక్ష్మి పాత్రలో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. గుర్తింపు దక్కని కళాకారుల జీవితాలకు ఈ చిత్రం అంకితమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సహా చిత్రబృందం సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇవి కదా అసలైన పాటలు’ అనిపించింది అని తెలపగా ఈ వేడుకలో మూవీ టీం సభ్యులందరూ పాల్గొన్నారు.

Also Read:NHM ఉద్యోగుల రెగ్యులరైజ్ ఎప్పుడు?

- Advertisement -