- Advertisement -
ఐపీఎల్ 2020 నిర్వహణపై క్లారిటీ ఇచ్చాడు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. ఈ ఏడాది ఐపీఎల్‌ని అవసరమైతే ఖాళీ స్టేడియాల్లో నిర్వహించే అవకాశం ఉందని తెలిపాడు. ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు దాదా. అభిమానులు, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు,బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, స్టేక్ హోల్డర్లతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు గంగూలీ తెలిపారు.
భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారని, మేం కూడా ఈ టోర్నీపై ఆశగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణనను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఐసీసీ బోర్డు మీటింగ్ తర్వాత తన అభిప్రాయాన్ని తెలిపిన గంగూలీ ఈ మేరకు బుధవారం రాత్రి అన్ని సంఘాలకు లేఖ రాశారు.
- Advertisement -