భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్, రంగ్ దే చిత్రంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రం నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ కానుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించనుందని సమాచారం. అంతేకాదు ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. శిల్పా శెట్టి ఒకప్పుడు తెలుగు తెరపై ఓ వెలుగువెలిగింది. ఈ యోగా బ్యూటీ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తోంది.

ఇక చిత్రంలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ భామ నభా నటేష్ నటించనున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభా నటేష్, అటు గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. అందుకే నితిన్ తో అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించడానికి నభా నటేష్ ని అడుగుతున్నారట.మరి ఈ రీమేక్‌లో నటించడానికి నభా ఒప్పుకుంటుందా లేదా చూడాలి.

