ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ

1
- Advertisement -

ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా గంగూలీ ఎంపికకాగా మరోసారి అవకాశం వచ్చింది.

కమిటీలో వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), హమిద్‌ హసన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌), టెంబా బవుమా (దక్షిణాఫ్రికా), జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లండ్‌) కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు.

మహిళల కమిటీకి న్యూజిలాండ్‌ హాఫ్‌ స్పిన్నర్‌ కేథరిన్‌ క్యాంప్‌బెల్‌ నేతృత్వం వహిస్తుండగా.. అవ్రిల్‌ ఫహే (ఆస్ట్రేలియా), ఫోలెట్సి మొసెకి (దక్షిణాఫ్రికా) సభ్యులుగా కొనసాగుతారు. అలాగే అఫ్ఘనిస్తాన్‌ మహిళా క్రికెటర్లకు సహాయం అందించేందుకు ఐసీసీ స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది.

Also Read:అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

- Advertisement -