భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ తన ఐపీఎల్ ఫాంటసీ లీగ్ కలల జట్టును ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన దాదా అసలు ఆ జట్టును నేను ప్రకటించలేదని ఆ ట్వీట్టర్ అకౌంటే నాది కాదని చెప్పుకొచ్చాడు. తాను కూడా ఆ ట్విట్టర్ అకౌంట్ ను ఇప్పుడే చూశానని చెప్పారు. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్లైంది.
Hi all ..just saw an ipl fantasy team on my name ..it's not my twitter account nor my team ..it's fake ..I dnt participate in fantsy leagues
— Sourav Ganguly (@SGanguly99) April 27, 2017
గంగూలీ డ్రీమ్ అంటూ వెలువడిన ఈ జట్టులో ధోనీ స్థానంలో దిల్లీ డేర్‌డెవిల్స్ యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు వికెట్‌కీపర్ బాధ్యతలు అందించారు. 11మంది సభ్యుల జట్టులో నలుగురు విదేశీయులకు గంగూలీ చోటు కల్పించాడు.
గంగూలీ డ్రీమ్ టీం..
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, డివిలియర్స్, నితీశ్ రాణా, మనీశ్ పాండే, రిషబ్ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్.
గతంలో కూడా ధోనీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కొనసాగిన మహీ ఐపీఎల్‌లో సరైన ఫాం లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోని టీ20లకు పనికిరాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అతను ఛాంపియనే కానీ.. టీ20ల విషయానికొస్తే గత పదేళ్లలో అతను కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు. ఇదేమంత గొప్ప రికార్డు కాదు’’ అన్నాడు.
అంతేగాదు ప్రస్తుత ధోని ఫామ్ ను బట్టి తనైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయను అని ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ధోని ఆటతీరుపై పుణే జట్టు యాజమాన్యం సైతం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.