బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంత్రి గంగుల..

157
minister gangula copy
- Advertisement -

శనివారం కరీంనగర్ జిల్లా నాగులమల్యాల, కొత్తపల్లి పట్టణంలో మహిళలకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ పిల్లి శ్రీలత, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి చెప్పారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో అన్నిమతాల పండుగలకు ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా పూలతో దేవుడిని కొలుస్తారని, కానీ పూలనే దేవతగా కొలిచే సంప్రదాయం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. ఐదేళ్లుగా సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన రూ.5 కోట్ల చీరెలను ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ దగ్గరుండి 275 డిజైన్లతో 20 రంగుల్లో అద్భుతంగా బతుకమ్మ చీరెలను తయారు చేయించి పంపిణీ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సమైక్య పాలకులు నేత కార్మికులకు ఉపాధి కల్పించకుండా సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారని, తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకొని సిరిసిల్లను సిరులసిల్లగా మార్చిందన్నారు మంత్రి గంగుల పేర్కొన్నారు.

- Advertisement -