కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

105
kcr

సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. నేడు ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ చ‌ట్టాల స‌వ‌ర‌ణ ముసాయిదా బిల్లుల‌పై మంత్రివ‌ర్గం చ‌ర్చించి ఆమోదించ‌నుంది. శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బిల్లుల‌పై మంత్రి వ‌ర్గం చ‌ర్చించ‌నుంది.

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై కూడా చ‌ర్చించి ఆమోదించ‌నున్నారు.జీహెచ్‌ఎంసీ చట్టాల సవరణ, హైకోర్టు సూచనలతో పలు చట్టాల్లో మార్పులు చేసేందుకు మంగళవారం అసెంబ్లీ సమావేశం కానున్నది. 13న ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. శాసనమండలి ఈ నెల 14న ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది.